Monday, January 10, 2011
పెన్ డ్రైవ్‍లను తనిఖీ చెయ్యడం ఎలాగంటే…
USB పెన్‌డ్రైవ్‌లు కొన్న కొద్దిరోజులకే డిటెక్ట్ అవకపోవడం, రీడింగ్/రైటింగ్ సమయంలో సమస్యలు తలెత్తడం వంటి ఇబ్బందులు ఇటీవలికాలంలో వినిపిస్తున్నాయి. నాసిరకం మీడియా, ఉత్పత్తి దశలోనే లోపాలు తలెత్తడం వంటి కారణాల వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ నేపధ్యంలో మీరు కొత్త పెన్ డ్రైవ్‌ని కొనుగోలు చేసిన వెంటనే మొట్టమొదట చేయవలసిన పని Check Flash అనే ఉచిత టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని మీ పెన్‌డ్రైవ్‌ని ఎంచుకుని Access Typeగా Use temporaray file, as logical drive అనే మూడు ఆప్షన్లని ఒకదాని తర్వాత ఒకటి ఎంచుకుని Write and Read testని నిర్వహించండి. దీంతో మీవద్ద ఉన్న పెన్‌డ్రైవ్ మెమరీ అడ్రస్‌లు సక్రమంగా ఉన్నదీ లేనిదీ తేలుతుంది. అలాగే Windowsలో ఉండే Scandisk ద్వారా పెన్‌డ్రైవ్‌లో ఉండే బేడ్ సెక్టార్లని కూడా గుర్తించడం మర్చిపోకండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment