Monday, January 10, 2011

వైరస్ ఇన్ ఫెక్ట్ అయిన పెన్ డ్రైవ్ లో నుండి సురక్షితంగా ఫైళ్లని బ్యాకప్ తీయడం

వైరస్ ఇన్ ఫెక్ట్ అయిన పెన్ డ్రైవ్ లో నుండి సురక్షితంగా ఫైళ్లని బ్యాకప్ తీయడం

 
ఇతర కంప్యూటర్లకు కనెక్ట్ చెయ్యడం వల్ల మీ పెన్ డ్రైవ్ లో వైరస్ ఉందనుకోండి. దాన్ని మీ పిసికి కనెక్ట్ చెయ్యాలంటే ఎక్కడ వైరస్ పిసిలోకి ప్రవేశిస్తుందో అని భయపడవలసి వస్తుంటుంది. ఒక్కోసారి ధైర్యం చేసి పెన్ డ్రైవ్ ని USB పోర్ట్ కి కనెక్ట్ చేసినా వైరస్ కారణంగా అందులోని ఫైళ్లని My Computer ద్వారా చూడలేని పరిస్థితి తలెత్తవచ్చు. అలాంటప్పుడు ఈ టెక్నిక్ పాటించండి.
Autorun డిసేబుల్ చేయండి:
USB పోర్ట్ కి పెన్ డ్రైవ్ ని కనెక్ట్ చెయ్యడానికి ముందు మీ కంప్యూటర్లో రిమూవబుల్ డిస్క్ లు autorun అయ్యే సదుపాయాన్ని డిసేబుల్ చేయడం మంచిది. అదెలాగంటే..
  1. Start>Run కమాండ్ బాక్స్ లో regedit అని టైప్ చేసి రిజిస్ట్రీ ఎడిటర్ ప్రోగ్రామ్ లోకి వెళ్లండి.
  2. ఇప్పుడు రిజిస్ట్రీలో HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Policies\Explorer అనే విభాగంలోకి వెళ్లండి.
  3. కుడిచేతి వైపు NoDriveAutorun అనే DWORD వేల్యూ ఉంటే దాన్ని డబుల్ క్లిక్ చేసి Decimal బటన్ ని టిక్ చేసి 255 అనే సంఖ్యని Value dataగా ఇవ్వండి. ఒకవేళ ఇప్పటికే NoDriveAutorun అనే DWORD ఎంట్రీ గనుక లేనట్లయితే మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>DWORD అనే ఆప్షన్ ఎంచుకుని కొత్తగా క్రియేట్ చెయ్యబడే DWORD వేల్యూకి NoDriveAutorun అనే పేరుని ఇచ్చి దానికి 255 అనే విలువను వేల్యూ డేటాగా ఇవ్వండి.
  4. ఇప్పుడు కంప్యూటర్ ని రీస్టార్ట్ చేస్తే autorun డిసేబుల్ చెయ్యబడుతుంది.
పెన్ డ్రైవ్ లోని డేటాని బ్యాకప్ తీయడం:
  1. Autorunని డిసేబుల్ చేసిన తర్వాత పెన్ డ్రైవ్ ని పిసికి కనెక్ట్ చేసి, My Computerలో పెన్ డ్రైవ్ ఐకాన్ పై రైట్ క్లిక్ చేసి Properties>Tools అనే విభాగంలో Backup Now అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చే డైలాగ్ బాక్స్ లో Backup files and settings అనే ఆప్షన్ టిక్ చేసి Next కొట్టండి.
  2. తర్వాత వచ్చే What to Back Up అనే స్ర్కీన్ లో Let me choose what to backup అనే ఆప్షన్ ని టిక్ చేసి Next కొట్టండి.
  3. తర్వాతి స్క్రీన్ లో ఏయే ఫైళ్లు, ఫోల్డర్లని బ్యాకప్ తీయాలో ఎడమచేతి వైపు విభాగంలో టిక్ చేసి Next కొట్టండి.
  4. Backup Type, Destination and Name అనే స్క్రీన్ లో ఆ ఫైళ్లని ఏ లొకేషన్ లోకి బ్యాకప్ తీయాలో ఎంచుకుని Next కొట్టండి.
  5. చివరిగా Finish అనే బటన్ ని క్లిక్ చేస్తే పెన్ డ్రైవ్ లోని ఇన్ ఫెక్ట్ అయి కాపీ అవని, ఓపెన్ అవని ఫైళ్లు మనం కోరిన లొకేషన్ లోకి బ్యాకప్ తీయబడతాయి

No comments: