Monday, January 10, 2011
పిల్లల కోసం చాలామంచి తెలుగు సైట్లు..
నేటి కాలంలో ఆంగ్లం ఉండగా తెలుగు ఎందుకు దండగ అని భావించే తల్లితండ్రులు ఎందరో. పరీక్షల కోసమై తప్పనిసరి పరిస్థితిలో, అవసరమున్నంతే తెలుగు నేర్చుకోవాల్సిన గ్రహచారం పట్టింది పిల్లలకు. తెలుగు ఎందుకు అని అన్నప్పుడు , ఆ భాష ఎంత సులువైనదో అని నేర్పించడానికి సులువైన , ఆకర్షణియమైన విధానంలో ఒక వెబ్‍సైట్‍ని మొదలెట్టారు లలిత . మాటలు కూడా రాని చిన్నారులకు బొమ్మల ద్వారా ఎన్నో వస్తువులను పరిచయం చేసి, వాటిని సులువుగా గుర్తుపట్టేలా చేయొచ్చంటారు ఆవిడ. ప్రవాసంలో ఉన్నా కూడా తమ పిల్లలకు, తెలుగు భాషపై మక్కువ పెంచుతూ పిల్లల ఉత్సాహమే పెట్టుబడిగా ఎందరో కుటుంబాల చిన్నారులకోసం telugu4kids అనే సైట్‍ను నిర్వహిస్తున్నారు. ఈ సైట్‍లో తేలికైన పదాలతో రైమ్స్, పద్యాలు, పొడుపుకథలు, చిన్న చిన్న కథలు, వ్యాకరణం, పదాలు , సంఖ్యలు మొదలగునవి పిల్లలకు నేర్పించే విధానం చెప్పబడింది. అదే విధంగా bookbox అనే సైట్‍లో కథలను అందమైన బొమ్మలతో , ఒక చిత్రంలా అందించారు. తమ చిన్నారులు తెలుగుభాషని సులువుగా నేర్చుకోవాలనుకుని కోరుకునే తల్లితండ్రులు తప్పక చూడవలసిన సైట్లు ఇవి.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
తెలుగు4కిడ్స్ ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మీకు తెలుగు4కిడ్స్ గురించి ఎలా తెలిసిందో చెప్పగలరా?
అలాగే, BookBox నా స్వంతం కాదు. నేను BookBox కథలు తెలుగులో అందించడానికి వారికి సాయం చేస్తున్నాను అంతే. BookBox వారు Living Legends పేరిట కిరణ్ బేడీ, అబ్దుల్ కలాం గార్ల కథలు పిల్లల కోసం ఆకర్షణీయంగా తయారు చేసి పుస్తకాలు, వీడియోలు కూడా అమ్ముతున్నారు. చాలా బావున్నాయి. ఇవి ప్రస్తుతానికి ఆంగ్లము, హిందీలలో దొరుకుతున్నాయి.
త్తెలుగు4కిడ్స్ పూర్తిగా ఉచిత సేవ. BookBox లో కొన్ని మాత్రమే ఉచితం.
Post a Comment