హిడెన్ ఫోల్డర్లని సులభంగా గుర్తించడం ఇలా!
Windows XP/Vista ఆపరేటింగ్ సిస్టమ్ లలో C డ్రైవ్ లో కొన్ని సిస్టమ్ ఫోల్డర్లు hidden గా సెట్ చెయ్యబడి ఉంటాయి. అవి Folder Optionsలో Show hidden files and folders అనే ఆప్షన్ ఎంచుకుంటే తప్ప Windows Explorerలో కన్పించవు. కేవలం సిస్టమ్ ఫోల్డర్లు మాత్రమే కాకుండా ఇతరుల కంటపడకుండా ఉండడం కోసం మనం కొన్ని ఫోల్డర్లని రైట్ క్లిక్ చేసి Properties డైలాగ్ బాక్స్ ద్వారా hidden అని సెట్ చేస్తుంటాం.ఈ నేపధ్యంలో C డ్రైవ్ లో ఉన్న అన్ని ఫోల్డర్లలో hidden ఫోల్డర్లు ఏమి ఉన్నాయో, open ఫోల్డర్లు ఏమి ఉన్నాయో ఓ జాబితాగా చూపించడానికి ఓ చిన్న టూల్ ఉపయోగపడుతుంది.
దీన్ని ఉపయోగించడం ఇలా:
స్టెప్ 1: http://computerera.co.in/short/hidden/ అనే లింక్ నుండి ముందు Special Folders View అనే జిప్ ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకోండి.

స్టెప్ 2: ఆ జిప్ ఫైల్ లో ఉండే Special Folders View అనే EXE ఫైల్ ని డెస్క్ టాప్ మీదకు drag & drop చేసి unzip చేయండి.

స్టెప్ 3: ఇప్పుడు డెస్క్ టాప్ నుండి ఆ EXE ఫైల్ ని రన్ చేస్తే C డ్రైవ్ లో ఏయే ఫోల్డర్లు hiddenగా ఉన్నాయో, ఏవి openగా ఉన్నాయో ఫోల్డర్ పేరు ఎదురుగా ఉండే hidden అనే ఫీల్డ్ వద్ద yes, no అనే ఆప్షన్లని చూడడం ద్వారా గ్రహించవచ్చు. Yes అని ఉంటే ఆ ఫోల్డర్ hidden ఫోల్డర్ క్రింద లెక్క.
No comments:
Post a Comment